Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూతురు వద్ద రూ. 10 కోట్లు అప్పు తీసుకున్న శత్రుఘ్న సిన్హా

  • శత్రుఘ్న సిన్హాకు రూ. 8.60 కోట్ల చరాస్తులు, రూ. 103.61 కోట్ల స్థిరాస్తులు
  • భార్య పూనంకు రూ. 18.67 కోట్ల చరాస్తులు, రూ. 62.65 కోట్ల స్థిరాస్తులు
  • ఇద్దరికీ కలిపి 8 కార్లు
తనకు రూ. 8.60 కోట్ల చరాస్తులు, రూ. 103.61 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన భార్య పూనమ్ పేరుపై రూ. 18.67 కోట్ల చరాస్తులు, రూ. 62.65 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. రూ. 2.74 కోట్ల మేర ఫిక్స్ డ్ డిపాజిట్లు, రూ. 29.10 లక్షల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. రూ. 1.03 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని... తన భార్యకు రూ. 1.15 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. తన కుమార్తె సోనాక్షి సిన్హా నుంచి రూ. 10.59 కోట్లు అప్పుగా తీసుకున్నానని చెప్పారు. ఒక అంబాసడర్, రెండు కామ్రీ, ఇన్నోవా, ఫార్చ్యూనర్, మారుతి సియాజ్, స్కార్పియో వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. తన భార్యకు మెర్సిడెస్ బెంజ్ కారు ఉందని చెప్పారు.  బీహార్ లోని పాట్నాసాహిబ్ నుంచి సిన్హా పోటీ చేస్తున్నారు.        
satrughan sinha
assets
congress

More Telugu News